![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -253 లో... రాజ్ అమెరికా నుండి డాక్టర్ ని రప్పించి, అతడికి సీతారామయ్య రిపోర్ట్స్ చూపిస్తాడు. అతనికి ఏం కాదు నేను ట్రీట్ మెంట్ చేస్తానని డాక్టర్ హామీ ఇవ్వడం తో దుగ్గిరాల కుటుంబం సంబరపడిపోతుంది.
ఆ తర్వాత సీతరామయ్య ఇంట్లో అందరికి ఇప్పటివరకు జరిగింది మర్చిపోయి అందరు హ్యాపీగా ఉండండని చెప్తాడు. అందరు కలిసి ఇంట్లో శుభకార్యం చెయ్యలని అనుకోని కళ్యాణ్ కి పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అవుతారు. మరొక వైపు అప్పుకి అన్నపూర్ణ భోజనం తినిపిస్తుంది. కనకం కృష్ణమూర్తి.. అప్పుకి ఏమైంది ఆలా ఉంటుందని అడుగుతారు. నాకేం కాలేదని అప్పు కోపంగా అంటుంది. అప్పుడే కళ్యాణ్ ఫోన్ చేస్తుంటాడు. అయిన అప్పు లిఫ్ట్ చెయ్యదు. కనకం వచ్చి లిఫ్ట్ చెయ్యమని చెప్తుంది. దాంతో అప్పు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది.
అర్జెంటు గా కలవాలి రమ్మని చెప్తాడు కళ్యాణ్. అదే సమయంలో అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి కలవాలని చెప్పగానే.. అనామిక సరేనని అంటుంది. మరొక వైపు రాజ్ చాలా హ్యాపీగా ఉంటాడు. అతని దగ్గరికి కావ్య వస్తుంది. ఇక ముందు మనం హ్యాపీగా ఉన్నట్లు నటించాలి తాతయ్య కోసమని కావ్య అనగా.. ఇన్ని రోజులు నువ్వు చేసిన మోసాలు చాలని రాజ్ అంటాడు. కాసేపు ఇద్దరు ఒకరికొకరు వాదించుకుంటారు. ఇక నుండి నేను నటించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూడండని కావ్య వెళ్లిపోతు.. ఏవండి ఐ లవ్ యు అని చెప్పి, ఫ్లైయింగ్ కిస్ ఇస్తుంది. ఇది కేవలం టైటిల్ మాత్రమే అసలు సినిమా ముందు ఉందని కావ్య అనగానే రాజ్ ఆశ్చర్యపోతాడు.
మరొక వైపు స్వప్న రెడీ అవుతుంటే స్వప్న ని చూస్తూ ఉంటాడు రాహుల్. అప్పుడే రుద్రాణి వచ్చి.. నేను ఆస్తి రాలేదు అన్న బాధలో ఉంటే నువ్వు నీ భార్య రెడీ అవుతు ఉంటే మురిసిపోతున్నావా అంటూ రుద్రాణి అంటుంది. లేదంటూ స్వప్నని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి తను వేసిన ప్లాన్ గురించి చెప్తాడు. స్వప్నకి పెళ్లి కాకముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడేం మాట్లాడుకోవడం లేదు కానీ మాట్లాడుకుంటున్నారని ఇంట్లో వాళ్ళని నమ్మించి స్వప్నని ఇంట్లో ని పంపించేయ్యలని రాహుల్ అంటాడు. మరొక వైపు అప్పు , అనామిక, కళ్యాణ్ దగ్గర కలుసుకుంటారు.
ఆ తర్వాత గుడ్ న్యూస్ అంటూ ఇంట్లో మన పెళ్లికి డేట్ ఫిక్స్ చేస్తున్నారని కళ్యాణ్ చెప్పగానే.. కళ్యాణ్ ని అనామిక హగ్ చేసుకుంటుంది. అది చూసి అప్పు మనసు ముక్కలవుతుంది. తరువాయి భాగంలో కావ్య అన్నట్లుగానే తన నటనతో రాజ్ కి చుక్కలు చూపిస్తుంది. హాల్లో ఒక బోర్డు పై రాజ్ రాసినట్టుగా సారి కళావతి అని రాసి ఉంటుంది. అది ఇంట్లో అందరు చూస్తారు. ఏంటి రాజ్ సారీ చెప్పాలని అనుకుంటే ఇలా చెప్పాలా? ముందే ఉంది కదా ఇప్పుడు చెప్పు అంటూ ధాన్యలక్ష్మి అనగానే.. రాజ్ ఇబ్బంది పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..
![]() |
![]() |